ఈనెల 30న ఢిల్లీలో సిఎం, సిజేల కాన్ఫరెన్స్ జరుగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రధానమంత్రి నరేంధ్రమోడీ, చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ హాజరు కానున్నారు. అలాగే అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. నేషనల్ జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ అథారిటి ఏర్పాటు ప్రధాన ఎజెండాగా సదస్సు జరుగనుంది.
దేశంలోని కోర్టుల్లో మౌలిక సదుపాయాల మెరుగుకోసం అథారిటి ఏర్పాటు చేయాలంటున్నారు సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ. సరైన మౌలిక వసతులు లేక పనితీరు మందకోడిగా తయారై కోర్టుల్లోపేరుకుపోతున్నాయి కేసులు.
ఈ సమస్యలను అధిగమించేందుకే అథారిటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫలితంగా కేసుల సత్వర పరిష్కారం ప్రజలకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంది. కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు సీజే. కరోనా నేపథ్యంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల వల్ల దేశవ్వాప్తంగా పెద్దెత్తున పేరుకుపోయాయి కేసులు.