కాంగ్రెస్ పోరు బాట… నేటి నుంచి రైతులకు మద్దతుగా జిల్లాల పర్యటన

-

హుజూరాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ మళ్లీ యాక్టివ్ అవుతోంది. ప్రజా సమస్యలపై ద్రుష్టి పెడుతోంది. ప్రజలకు దగ్గరయ్యేందుకు కార్యాాచరణ మొదలుపెట్టారు. దీంతో తెలంగాణ లో రైతు సమస్యలపై పోరు సాగించాలని నిర్ణయించుకున్నారు. రైతుల పక్షాన పోరా డేందుకు కార్యాచరణ రెడీ చేసుకున్నారు. నేటి నుంచి జిల్లాల వారీగా పర్యటనుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. నాలుగు టీములుగా జిల్లాల్లో పర్యటన చేయనున్నారు. నల్లగొండ, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తొలిరోజు పర్యటన సాగనుంది. రైతులను కలిసి వారి బాధలను తెలుసుకోనున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలకు ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఈనెల 8న మహిళా కాంగ్రెస్ నిరసనలు చేయనుంది. అదే రోజు రాష్ట్రంలో పౌరసరఫరా కార్యాయాలను మట్టడించనున్నారు. 12,13 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కు కాంగ్రెస్ నేతలు సిద్ధం అవుతున్నారు. ఇందుకు సంబంధించి శనివారమే పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. రైతు సమస్యలపై పోరాడేందుకు రోడ్ మ్యాప్ ఖరారు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version