రెండోస్థానంలో కాంగ్రెస్..రేవంత్ ధీమా అదే!

-

తెలంగాణలో రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరు రాజకీయంగా పైచేయి సాధిస్తారో అర్ధం కాకుండా ఉంది..ఒకోసారి ఒకో పార్టీ ఆధిక్యం చెలాయిస్తుంది. అసలు రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్-బి‌జే‌పిల మధ్య త్రిముఖ పోరు నడుస్తుందనే చెప్పాలి. మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే రాజకీయంగా చూస్తే బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య పెద్ద ఎత్తున పోలిటికల్ వార్ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే రాష్ట్రం వర్సెస్ కేంద్రం అనే పరిస్తితి.

కానీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేరుగా ఉన్నాయి. బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి అన్నట్లు పోరు నడుస్తుంటే..ఆ రెండు పార్టీలు ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయని అనుకోవడానికి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో బి‌జే‌పి కంటే కాంగ్రెస్ పార్టీకే బలం ఎక్కువ కనిపిస్తుంది. రాజకీయ పోరులో కాంగ్రెస్ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తున్నా..క్షేత్ర స్థాయిలో మాత్రం కాంగ్రెస్ రెండో ప్లేస్ లో ఉందని తెలుస్తోంది. బి‌జే‌పితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం, క్యాడర్ ఉంది. రేవంత్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపు వచ్చిందనే చెప్పాలి.

రేవంత్ రెడ్డి సైతం..కాంగ్రెస్ పార్టీ రెండోస్థానంలో ఉందని చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత సర్వేల ప్రకారం కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉందని,  సర్వేలలో 32 నుంచి 34 శాతం ఓటింగ్‌లో ఉన్నామని, తమ దృష్టి అంతా రాష్ట్రంలో అధికారంలోకి రావడంపైనే ఉందన్నారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణపై ఫోకస్‌ పెట్టామని, ఇంకో 5 శాతం ఓట్లు పెంచుకుంటే అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ అంటున్నారు.

అంటే రేవత్ సైతం రెండో స్థానంలో ఉన్నామని చెబుతున్నారు..అంటే మొదట స్థానం బి‌ఆర్‌ఎస్ పార్టీ ఉందని చెప్పవచ్చు. ఇక బి‌జే‌పి మూడో స్థానానికి పరిమితం అవుతుందా? అనే పరిస్తితి. కానీ ఎన్నికలనాటికి ఏదైనా జరగవచ్చు. ఎవరి ప్లేసులు అయినా తారుమారు కావచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version