కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే బాగుండదు : బడంగ్ పేట్ కార్పొరేటర్లు

బడంగ్ పేట్ కాంగ్రెస్ కార్పొరేటర్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు. ఖబర్దార్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ..మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెడితే ఊరుకునేది లేదన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చెరువుల సుందరీకరణ పేరుతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యకర్తలకు డబ్బులు దోచి పెడుతున్నారని ఆరోపించారు. బడంగ్ పేటలోని ఏ శిలాఫలకం చూసినా..మున్సిపల్ నిధులతో ఏర్పాటు చేసినదే అని చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గంలో హౌస్ ట్యాక్సులు తగ్గించాలని అనేక సార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. తీగల కృష్ణారెడ్డి ఉన్న సమయంలో మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయన్నారు.

వారిని కాదని..తమను గెలిపించినందుకు తగిన బుద్ది చెప్పారన్నారు. రాబోయే ఎన్నికల్లో మహేశ్వరంలో ప్రజలు బుద్ది చెప్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ గుర్తు పై గెలిచి మంత్రి పదవి కోసం బిఆర్ఎస్ లో చేరిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..మహేశ్వరం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సొంత లాభం కోసం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన సబితా ఇంద్రారెడ్డి.. కాంగ్రెస్ మేయర్ జోలికి వస్తే సహించేది లేదన్నారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?