కేంద్రం కీలక నిర్ణయం.. ఉద్యోగులకు శుభవార్త..

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్ చెప్పనుంది నరేంద్ర మోదీ సర్కార్​! ప్రస్తుతం ఉన్న కరవు భత్యాన్ని నాలుగు శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా 38 శాతంగా ఉన్న కరవు భత్యం 42 శాతానికి పెరగుతుంది. ఈ డీఏ పెంపు నిర్ణయాన్ని జనవరి 1 నుంచే వర్తింపచేయనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.”2022 డిసెంబర్​కు సంబంధించిన పరిశ్రమ కార్మికుల ద్రవ్యోల్బణ నివేదికను జనవరి 31న కార్మిక శాఖ విడుదల చేసింది. అందులో ఉన్న ద్రవ్యోల్బణం లెక్కల ప్రకారం చూస్తే 4.23 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంటుంది.

- Advertisement -

కానీ ప్రభుత్వం డెసిమల్​ పాయింట్​ను పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి డీఏ నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నాం” అని ఆల్​ ఇండియా రైల్వేమెన్​ ఫెడరేషన్​ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా అభిప్రాయపడ్డారు.గతేడాది సెప్టెంబర్​లో నాలుగు శాతం పెంచడం వల్ల కరవు భత్యం 38 శాతానికి చేరింది. పెంచిన డీఏను 2022 జూలై 1 నుంచి వర్తింపజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...