ట్విట్టర్ పిట్ట తోక ముడిచింది… కాంగ్రెస్ ట్విట్టర్ బ్లాక్ చేయడంపై కేటీఆర్ పై సెటైర్లు

-

రాహుల్ గాంధీ పర్యటనపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలపై ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. రాహుల్ గాంధీ తెలంగాణ ఎందుకు వస్తున్నారంటూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు ట్వీట్లు చేస్తే దీనికి ప్రతిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… రాహుల్ గాంధీని ప్రశ్నించేందుకు సిగ్గు అనిపించడం లేదా..? గడిచిన ఎనిమిదేళ్లుగా మోడీ పంచన చేరి తెలంగాణను వంచన చేశారని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ సాధించలేదని ట్వీట్లు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ పాలనపై చూసుకుని మురవాలి చెప్పుకోని ఏడ్వాలి అంటూ ట్విట్లు చేశారు. 

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ట్విట్టర్ హ్యండిల్ ను మంత్రి కేటీఆర్ బ్లాక్ చేయడం… ఈ ట్వీట్ వార్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది. కేటీఆర్ కాంగ్రెస్ ట్విట్టర్ ను బ్లాక్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు పేలుస్తోంది. ‘ ట్విట్టర్ పిట్ట తోకముడిచింది. ప్రశ్నను చూసి గజగజ వణికింది. ప్రజల తరపున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్ చేశారు. ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను బ్లాక్ చేయడం కేటీఆర్ మానసిక స్థితికి అద్దం పడుతోంది.’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ ట్విట్టర్ ను మేం అసలు పట్టించుకోం అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news