‘కొమురం భీముడో’ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది..హావ భావాలతో కంటతడి పెట్టిస్తున్న తారక్

-

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ RRR సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిల్మ్ రిలీజ్ అయి నెల రోజులు దాటుతున్నా రికార్డు వసూళ్లు చేస్తోంది ఈ చిత్రం. ఇక ఈ మూవీ నుంచి వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

ఇప్పటి కే ఈ చిత్రం నుంచి ‘దోస్తీ , కొమ్మా ఉయ్యాల, ఎత్తర జెండా’ సాంగ్స్ వీడియోలు విడుదల చేసిన మేకర్స్..తాజాగా ‘కొమురం భీముడో’ సాంగ్ వీడియో విడుదల చేశారు. ఇక ఈ పాటలో తారక్ ఎక్స్ ప్రెషన్స్ చూసి జనాలు ఫిదా అవుతున్నారు.

తారక్..మూడు నిమిషాల పాటలోని ఎక్స్ ప్రెషన్స్ తో మూడు గంటల పాటు రామ్ చరణ్ తో నటన లో పోటీ ఇచ్చారని ఈ సందర్భంగా సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ పాటకు లిరిక్స్ సుద్దాల అశోక్ తేజ అందించగా, మ్యూజిక్ ఎం.ఎం.కీరవాణి అందించారు. ఈ పాట వీడియోనూ మీరూ ఇక్కడ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news