ఈ ఆహారపదార్ధాలని డైట్ లో తీసుకుంటే కాపర్ ని పొందొచ్చు..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి. శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలు తప్పక ప్రతిరోజూ తీసుకుంటూ ఉండాలి. అయితే చాలా మంది ఎక్కువగా ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ వంటి వాటిపై శ్రద్ధ పెడతారు. కానీ కాపర్ పైన శ్రద్ధ పెట్టరు. కాపర్ ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే కాపర్ ఎలా పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు కాపర్ ఎందుకు అవసరం అనేది చూస్తే బ్రెయిన్ హెల్త్ కి కాపర్ చాలా అవసరం. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా అవసరం. ఇది ఎముకల్ని దృఢంగా చేస్తుంది. అలాగే ఇది నరాల ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. కాపర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే న్యూరోట్రాన్స్మిటర్స్ కి కూడా కాపర్ అవసరం. కాపర్ లోపం ఉంటే ఎనీమియా మొదలైన సమస్యలు వస్తాయి. కాబట్టి కాపర్ ని తప్పక డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. అయితే కాపర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం.

ఆకుకూరలు:

ఆకుకూరల్లో కాపర్ ఉంటుంది. పాలకూర, కలే వంటి వాటిలో కాపర్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటుంది. ఎనీమియా సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది.

డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్ మరియు మినిరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫైబర్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్స్ మరియు మినరల్స్ కూడా ఉంటాయి. జీడిపప్పు బాదం పప్పు లో కాపర్ ఎక్కువగా ఉంటుంది. శాకాహారులు కి బాగా కాపర్ అందడానికి ఇదే మంచి మార్గం.

గింజలు:

నువ్వులు, ఫ్లేక్ సీడ్స్ వంటి వాటిలో కాపర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గింజల్ని కూడా డైట్ లో ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ లో కూడా ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కనుక దీనిని కూడా డైట్ లో తీసుకుని ఈ లాభాలని పొందండి. అలానే ఈ సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news