భారతదేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఈ రోజు మూడు లక్షలకు దగ్గర కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్ లో కొత్తగా 295041 కరోనా కేసులు 2023 కరోనా మరణాలు నమోదయ్యాయి. కేవలం ఐదు రాష్ట్రాల్లో 54 శాతానికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత టెన్షన్ పెడుతోంది.
గత వారం రోజుల్లో 16.9 లక్షల కొత్త కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. అందుతున్న సమాచారం మేరకు 1,67,457 మంది 24 గంటల్లో రికవర్ అయ్యారు. ఇప్పటి దాకా నమోదయిన కేసులు 1,56,16,130గా ఉండగా మొత్తం రికవరీల సంఖ్య 1,32,76,039కి చేరింది. ఇక కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,82,553కి చేరగా యాక్టివ్ కేసులు 21,57,538గా ఉన్నాయి.