నిర్మాతగా ప్రభాస్ తండ్రి తీసిన సూపర్ హిట్ సినిమాలివే..!

-

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్..‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దేశవ్యాప్తంగా ఆయనకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయన నుంచి వచ్చే చిత్రా ల కోసం సినీ లవర్స్ ఈ గర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ గత చిత్రం ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఫిల్మ్ ఎలా ఉంటుందోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే..ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు నిర్మాత అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ క్రమంలోనే ఆయన తీసిన సినిమాలేంటి? అన్న సంగతి తెలుసుకుందాం.

ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ నిర్మాత, కాగా, ఆయన పెదనాన్న కృష్ణం రాజు హీరోగా సినిమాలు చేశారు. ఇక తండ్రి, పెదనాన్నల నటవారసత్వాన్ని హీరో ప్రభాస్ కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ నిర్మాతగా తీసిన సినిమాలు తక్కువే అయినా అన్నీ ఫిల్మ్స్ సక్సెస్ కావడం విశేషం. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా సూర్య నారాయణరాజు ఉన్నారు. సూర్య నారాయణ రాజు ప్రొడ్యూస్ చేసిన పిక్చర్స్ అన్నిటిలో కృష్ణంరాజు హీరోగా నటించారు.

కృష్ణంరాజు, వాణి శ్రీ జంటగా నటించిన ‘కృష్ణవేణి’ పిక్చర్ ను సూర్యనారాయణ ప్రొడ్యూస్ చేశారు. మధుసూదన్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. బాపు దర్శకత్వంలో మరోసారి కృష్ణంరాజు-వాణి శ్రీ జంటగా నటించిన ‘భక్త కన్నప్ప’ కూడా సూపర్ హిట్ అయింది. ఇక దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అమర దీపం’ చిత్రం ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుపెట్టుకునే చిత్రంగా నిలిచిపోయింది.

ఈ మూవీలో కృష్ణంరాజు నటనకు నంది అవార్డు వచ్చింది. ఇందులో కృష్ణంరాజుకు జోడీగా సహజ నటి జయసుధ నటించింది. సెంటిమెంట్ ప్లస్ ఎమోషనల్ సీన్స్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటన హైలైట్ అయింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణం రాజు నటించిన మరో పిక్చర్ ‘మధురస్వప్నం’. ఇందులో జయప్రద, జయసుధ హీరోయిన్స్ కాగా ఇది కూడా సూపర్ హిట్ అయింది.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణంరాజు, శారద, జయసుధలు నటించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ మూవీ టీవీల్లో వస్తే చూసేందుకు జనాలు వెయిట్ చేస్తుంటారు. ఈ మూవీని ‘ధరమ్ అధికారి’గా హిందీలోకి డబ్ చేయగా, అక్కడ కూడా మంచి ఆదరణ లభించింది.

దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణంరాజు, జయప్రద, జయసుధ కలిసి నటించిన ‘తాండ్ర పాపారారాయుడు’సూపర్ హిట్ అయింది. ఇందులో కృష్ణంరాజు నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా సూర్యనారాయణరాజు ప్రొడ్యూస్ చేసిన ఆరు సినిమాలు సూపర్ హిట్ గానే నిలవడం విశేషమని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news