దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. మహమ్మారి కట్టడిలో ఉండటం వల్ల క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొద్దిరోజులుగా మూడు వేల సమీపంలోనే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.
వైరస్ వ్యాప్తి అదుపులో ఉండడంతో క్రియాశీల కేసులు క్రమంగా తగ్గిపోతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు నమోదైన కరోనా కేసులు, మరణాలు, క్రియాశీలక కేసులు, రికవరీల వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
ఒక్కరోజులో 1,87,511 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిలో కొత్తగా 2,468 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 5,28,733 మంది మరణించారు. ఇప్పటి వరకు 4.40 కోట్ల మంది కొవిడ్ వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 33,318 (0.07%) క్రియాశీల కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 218.83 కోట్ల కొవిడ్ టీకాలు పంపిణీ చేసినట్లు తెలిపాయి.