మీరు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారా..? అయితే జాగ్రత్త..!

-

చాలా మందికి సాధారణంగా జ్వరం, నొప్పి వచ్చినప్పుడు.. నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. అయితే దాని వల్ల ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం కరోనా తీవ్రత పెరుగుతున్న తరుణంలో ప్రజలు ఇబుప్రోఫెన్ వంటి వివిధ రకాల పెన్ కిల్లర్ ట్యాబ్లెట్లను తీసుకోకుండా ఉండాలని సూచించింది. మధుమేహం, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు తీసుకోవడం ప్రమాదకరమని, వీరికి కిడ్నీ దెబ్బతినే ప్రమాదముందన్నారు. స్టెరాయిడ్ ఎక్కువగా ఉండే ట్యాబ్లెట్లను తీసుకోవద్దని, మీ ఆరోగ్యాన్ని వైద్యులకు సూచించినప్పుడే ఎలాంటి మందులైనా.. వారి సలహా తీసుకుని వేసుకోవాలని పేర్కొన్నారు. అయితే జ్వరంతో బాధపడేటప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకోవచ్చని, ఇది నొప్పి నివారణలలో సురక్షితమైన ట్యాబ్లెట్‌గా పరిగణించింది.

ట్యాబ్లెట్
ట్యాబ్లెట్

వీరికి కరోనా సోకుతుందా..?
డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన వ్యక్తుల కంటే కరోనా బారిన పడే అవకాశాలు ఉంటాయని ఐసీఎంఆర్ పేర్కొంది. కరోనాతో తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, అలాంటి సమయాల్లో తగిన జాగ్రత్తలు, వైద్యుల సూచనలు పాటించాలని ఐసీఎంఆర్ తెలిపింది.

డయాబెటిస్ రోగులకు..
డయాబెటిస్ రోగులకు కరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. కానీ కొంత మంది బాధితుల్లో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే లక్షణాలకు కనుగొన్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అలాంటప్పుడు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. రోజు వారీ వ్యాయామం తప్పనిసరిగా చేస్తుండాలి. డయాబెటిస్‌కు సంబంధించిన ట్యాబ్లెట్లను టైం టు టైం వేసుకోవాలి. క్రమం తప్పకుండా శరీరంలో చక్కెర స్థాయిని పరీక్షిస్తూ ఉండాలి. అప్పుడే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్నవాళ్లు తేలికపాటి కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ.. సకాలంలో వైద్యుల సలహా మేరకు టీకా తీసుకోవాలి. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచేందుకు మెడిసిన్స్ తీసుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలన్నారు. శారీరక శ్రమ చేస్తూ.. బీపీ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news