corona: కొత్తగా మరో రెండు కరోనా వేరియంట్లు

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. గత రెండేళ్లుగా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ప్రజలను పట్టిపీడిస్తోంది. అనేక మంది ప్రాణాలు తీసింది. ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తోంది. ఆల్ఫా, బీటీ, డెల్టా, ఓమిక్రాన్, ప్రస్తుతం ఓమిక్రాన్ XE, ఇలా వరసగా వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా చైనాలో ఓమిక్రాన్ వేరియంట్ దాటికి ఆదేశంలో నగరాలు లాక్ డౌన్లలోకి వెళ్లాయి. 

ఇదిలా ఉంటే మరో రెండు కొత్త వేరియంట్లను గుర్తించారు పరిశోధకులు. ఓమిక్రాన్ లో మరో రెండు సబ్ వేరియంట్లను దక్షిణాఫ్రికా పరిశోధకులు గుర్తించారు. కొత్తగా బీఏ 4, బీఏ 5 ఓమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించారు. అయితే ప్రస్తుతానికి తమ దేశంలో ఈ వేరియంట్ల వల్ల కేసులు గానీ, మరణాలు కానీ పెరగలేదని వెల్లడించారు. బోట్స్ వానా, బెల్జియం, డెన్మార్క్, బ్రిటన్, జర్మనీ దేశాల్లో ఈ వేరియంట్లు బయటపడినట్లు వెల్లడించారు. ఓమిక్రాన్ వేరియంట్ వల్ల ఇప్పటికే పలు దేశాల్లో కేసులు పెరిగాయి. ఆ తరువాత బీఏ1, బీఏ 2, XE వేరియంట్లు బయటపడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news