చైనాలో వూహన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ రెండేళ్లు గడిచినా.. ప్రపంచాన్ని వదలడం లేదు. తన రూపాలను మార్చుకుంటూ ప్రపంచం మీద ఎటాక్ చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్, బీఏ2 వంటి వేరియంట్ల రూపంలో ప్రజలను ఇబ్బంది పెడుతోంది. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ దేశాలు కరోనా ధాటికి అతలాకుతలం అవుతున్నాయి. మరోవైపు అన్ని దేశాల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నా.. కరోనా తీవ్రతకు మాత్రం అడ్డుకట్టపడటం లేదు.
అమెరికా.. కరోనా ధాటికి అతలాకుతలం అవుతోంది. అక్కడ విపరీతంగా కరోనా కేసులు వస్తున్నాయి. అక్కడ మరణాల సంఖ్య 9 లక్షలను దాటింది. ప్రపంచంలోనే అమెరికాలోనే ఎక్కువ మరణాలు సంభవించాయి. ఎప్రిల్ నాటికి అక్కడ మరణాలు 10 లక్షలను దాటుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆతరువాతి స్థానాల్లో 6 లక్షల మరణాలతో బ్రెజిల్ రెండోస్థానంలో ఉండగా…5 లక్షల మరణాలతో ఇండియా మూడో స్థానంలో ఉంది. గడిచిన 50 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా లక్ష మరణాలు సంభవించాయని ఓ నివేదిక తెలుపుతోంది.