మళ్ళీ కరోనా విశ్వరూపం.. సెకనుకి ఏడుగురికి ?

-

తగ్గిపోయింది అనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ అని నిపుణులు సంభోదిస్తున్న ఈ తరుణంలో కేసులు లెక్కకు మించి నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భయంకరంగా ఈ కరోనా కేసులు పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం రోజుకు 11 వేల మంది కరోనా బారిన పడి మృతి చెందుతున్నారు. చలి కారణంగా ఈ కరోనా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి సెకనుకు 7 కరోనా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 641257 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన కరోనా కేసుల సంఖ్య 578 768 96 కు చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 13 76 637 కి చేరింది. ఏపీలో నిన్న 1221 కొత్త కేసులు నమోదు కాగా పది మంది మరణించారు. దీంతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 859932 కు చేరింది. ఇక తెలంగాణలో కూడా ఇప్పటి దాకా 261728 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Read more RELATED
Recommended to you

Latest news