గ్రేటర్ వార్ : మొత్తం 2602 నామినేషన్లు, ఏ పార్టీ నుండి ఎన్నంటే ?

తెలంగాణాలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల హదావుడి మొదలయింది. ఈ ఎన్నికలకు గాను నిన్నటితో నామినేషన్ ల ప్రక్రియ ముగిసింది. ఇక ఈ ఎన్నికలకు నామినేషన్లు ముగిసిన నాటికి మొత్తం 1932 మంది అభ్యర్థులు 2602 నామినేషన్లు దాఖలు చేశారు. అందుతున్న సమాచారం మేరకు, నిన్న చివరి రోజు కావడంతో 1412 మంది అభ్యర్థులు 1937 నామినేషన్లు దాఖలు చేశారు.

ఇక నిన్న నామినేషన్లు దాఖలు చేసిన వారిలో బీజేపీ నుంచి 571 మంది, సిపిఐ నుంచి 21, సిపిఎం నుండి 22, కాంగ్రెస్ నుంచి 372,  ఎంఐఎం నుండి 78, టీఆర్ఎస్ నుంచి 557 మంది, టీడీపీ నుంచి 206, రికగ్నైజ్డ్, రిజిస్టర్ పొలిటికల్ పార్టీల నుంచి 115 మంది, అలాగే 650 మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఈరోజు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. మొత్తం దాఖలు అయిన నామినేషన్ లలో అతి ఎక్కువగా కూకట్ పల్లి లో 119, తక్కువగా బేగంపేటలో 39 నామినేషన్ లు దాఖలు అయ్యాయి.