బ్రేకింగ్: జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్

టాలీవుడ్ లో అందరూ కరోనా దెబ్బకు భయపడుతున్నారు. ప్రముఖులు కరోనా బారిన పడటం ఒకటి అయితే కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోవడం మరింతగా ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా తనే ట్విట్టర్ లో ప్రకటించాడు. ఫ్యామిలీ మొత్తం కూడా హోం ఐసోలేషన్ లో ఉన్నామని తెలిపాడు.

తన అభిమానులు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యంగా ఉన్నా అని చ్చేప్పాడు. తనతో కాంటాక్ట్ లో ఉన్న వారు అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని అతను విజ్ఞప్తి చేసాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.