కేన్ విలియమ్సన్ కు కరోనా పాజిటివ్.. రెండో టెస్టుకు దూరం

-

శుక్రవారం నాటింగ్ హమ్ లో ఇంగ్లాండ్ తో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ కి ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొవిడ్-19 పాజిటివ్ గా తేలాడు. దీంతో రెండో టెస్టు మ్యాచ్ లో అతను ఆడడం లేదు. గురువారం పగటిపూట విలియమ్సన్ లో చిన్నపాటి లక్షణాలు కనిపించడంతో అతనికి రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో పాజిటివ్ గా తేలింది. దీంతో అతను మ్యాచ్ కు దూరమయ్యాడు. కేన్ విలియమ్సన్ ఐదురోజులపాటు ఐసోలేషన్ లో ఉంటాడని కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు.

కేన్ విలియమ్సన్ కు పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు లోని మిగిలిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించారు. కాగా అందరికీ నెగిటివ్ వచ్చాయి.కేన్ విలియంసన్ స్థానంలో స్టెడ్ ధ్రువీకరించిన ఓపెనర్ టామ్ లాథమ్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఇక విలియమ్సన్ స్థానంలో హామీష్ రూథర్ఫోర్డ్ ను జట్టులోకి పిలిచారు. ఇంత ముఖ్యమైన మ్యాచ్ సందర్భంగా కేన్ వైదొలగాల్సిరావడం చాలా బాధాకరమని కోచ్ స్టెడ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news