కళ్లతోనే హావ భావాలు పలికించే అందం హీరోయిన్ రాశి ఖన్నాది అని చెప్పొచ్చు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో నాగ శౌర్యకి జోడీగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రాశి. ఈ మూవీ క్లాసిక్ లవ్ స్టొరీ అయి సూపర్ హిట్ కాగా ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. ‘జోరు’ సినిమాతో జోరందుకున్న ఈ భామ తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటించి అనతి కాలంలోనే స్టార్ డం సంపాదించుకుంది.
బొద్దుగా ఉండే రాశి ఖన్నా ఆ తర్వాత కాలంలో ఫిట్ నెస్ ఫ్రీక్ గా మారిపోయింది. సన్నని తీగలాంటి సొగసుతో ప్రస్తుతం కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫొటోల్లో నలుపు రంగు ప్యాంట్, స్లీవ్ లెస్ టాప్ మ్యాచింగ్ ఐ గ్లాసెస్ ధరించి రాశి బక్క చిక్కిన అందాలతో హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ‘బోల్డ్ టెర్రిఫిక్, గ్లామరస్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా ‘పక్కా కమర్షియల్, థాంక్ యూ,సర్దార్,యోధ,తిరుచిత్రంబలం’ సినిమాలలో నటిస్తోంది.
View this post on Instagram