తమిళనాట ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. ఈసారి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు సేరియాస్ గా తీసుకున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకే మాత్రం డీఎంకేతో కలిసి పోటీ చేస్తుండగా అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకే ఒంటరిగా పోటీ చేస్తోంది. ఏఎంఎంకే నాయకత్వంలోని కూటమిలో ఎంఐఎం సహా 4 పార్టీలు భాగస్వామ్య పక్షాలు గా ఉన్నాయి.
ఈ సమీకరణాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు అన్నా డీఎంకే, డీఎంకే, ఎంఎన్‌ఎం, ఏఎంఎంకే కూటముల మధ్య చతుర్ముఖ పోటీగా తయారైంది. ఆ సంగతి అల ఉంచితే ఇప్పుడు తమిళనాడు అభ్యర్ధుల్లో కరోనా భయం నెలకొంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యే అభ్యర్ధులు, నలుగురు ముఖ్య నేతలకు కరోనా సోకింది. డీఎంకే, ఎంఎన్‌ఎం అభ్యర్ధుల్లో ఇద్దరిద్దరికి కరోనా సోకింది. ఇక కరోనా దెబ్బకు ఇప్పటికే అక్కడ విద్యాసంస్థలు కూడా మూసివేశారు.