మళ్లీ పెరుగుతున్న కరోనా ఉధృతి.. తాజాగా కేసులెన్నంటే?

-

ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ ఉగ్రరూపం దాల్చాయి. దేశవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురవడం.. వాతావరణంలో మార్పులు రావడమే.. దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,906 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,32,457కి చేరింది. అయితే కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.30 శాతం ఉందని.. రికవరీ రేటు 98.49 శాతంగా ఉందని అధికారులు వెల్లడించారు.

కరోనా-వైరస్
కరోనా-వైరస్

అలాగే గడిచిన 24 గంటల్లో 15,447 మంది కరోనా బారిన పడి కోలుకుని తమ స్వగృహానికి వెళ్లారు. నిన్న ఒక్కరోజే 45 మంది వరకు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 5,25,519కి చేరిందని కేంద్రం వెల్లడించింది. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా లేదని, సీజనల్ వ్యాధుల వ్యాప్తి కూడా అధికంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండటం.. వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news