ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఏపీలో ఎప్పటికప్పుడు పలు సర్వేలు జరుగుతున్నాయి. పార్టీల గెలుపోటములపై కొన్ని నివేదికలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ కోసం పీకే టీం పనిచేస్తున్న విషయం తెలిసిందే…ఆ టీం ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూనే ఉంది. అలాగే ఇతర సంస్థలు సైతం సర్వేలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పరిస్తితి ఎలా ఉంటుంది…అలాగే ఏ జిల్లాల్లో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందనే అంశాలపై సర్వేలు బయటకొస్తున్నాయి.
ఇదే క్రమంలో తాజాగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు సంబంధించి…ఓ సరికొత్త విశ్లేషణ వస్తుంది…ఇక్కడ బాబుకు భారీ షాక్ ఇస్తూ…మళ్ళీ చిత్తూరు ప్రజలు వైసీపీనే ఆదరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎలాగో చిత్తూరు ప్రజలు వైసీపీని ఆదరించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉండగా, వైసీపీకి 13, టీడీపీకి ఒక సీటు వచ్చింది.
అయితే మూడేళ్లలో పలు జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగింది…అలాగే టీడీపీ నేతలు పుంజుకున్నారు…కానీ చిత్తూరులో మాత్రం సీన్ మారలేదని తెలుస్తోంది..ఇప్పటికీ అక్కడ వైసీపీదే పైచేయి అని తెలుస్తోంది. కాకపోతే గత ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకుంది…కానీ ఇప్పుడు ఆ బలం 8కి పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీ మళ్ళీ పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు, తంబళ్ళపల్లె, చంద్రగిరి సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి.
ఇక టీడీపీకి…కుప్పం, నగరి, పీలేరు, పలమనేరు సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంకా తిరుపతి, శ్రీకాళహస్తి సీట్లలో వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు ఉందని సమాచారం. మొత్తం మీద చిత్తూరులో వైసీపీకి 8, టీడీపీకి 4, రెండు చోట్ల టఫ్ జరిగే ఛాన్స్ ఉంది. కానీ చిత్తూరులో మళ్ళీ వైసీపీకే ఆధిక్యం కనిపిస్తోంది. ఈ సారి కూడా అక్కడ ఎక్కువ సీట్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా చిత్తూరులో మళ్ళీ సైకిల్ చిత్తు అయ్యేలా ఉంది.