కమల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కరోనా నుంచి కోలుకున్న కమల్ హాసన్ త్వరలో డిశ్చార్జ్ కానున్నట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల ప్రముఖ హీరో , మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. ఆయన ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ అభిమానులు ప్రార్థనలు చేశారు. సినీ ప్రముఖులు కూడా ఆయన కోలుకుని త్వరగా తిరిగి రావాలంటూ కోరుకున్నారు. వారందరి ప్రార్థనలు ఫలించి విశ్వ నాయకుడు కమల్ హాసన్ యథావిధిగా తన పనుల్లో నిమగ్నం అవనున్నారు.
తాజాగా కమల్ హాసన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్. ఆయన కరోనా నుంచి కోటుకున్నట్లుగా ఆసుపత్రి హెల్త్ బులెటిన్ లో తెలిపింది. కమల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండని తెలిపింది. ఈ నెల 3న డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఈ నెల 4 నుంచి కమల్ తన పనులను చేసుకోవచ్చని వైద్యులు పేర్కొన్నారు.