లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల లాభాలని ఇస్తోంది. వీటి వలన చాలా బెనిఫిట్స్ ని ప్రజలు పొందుతున్నారు. అయితే తాజాగా ఎలైసి పేద ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
పేద ప్రజలకు బెనిఫిట్ కలగడానికి ఎల్‌ఐసీ భాగ్య లక్ష్మి ప్లాన్ పేరుతో ఒక పాలసీని తీసుకొచ్చింది. దీనితో తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు ఇది హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. ఇందులో చెల్లించిన ప్రీమియంలో 110 శాతంను మెచ్యూరిటీపై పొందే అవకాశం ఉంటుంది.
ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు పాలసీ వ్యవధితో పోలిస్తే తక్కువ ప్రీమియంను చెల్లించాలి. ఇక ఎవరు ఈ పాలసీని తీసుకొచ్చు అనేది చూస్తే.. 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించవచ్చు.
ఈ పాలసీలో కనీస హామీ మొత్తం 20,000 రూపాయలు కాగా గరిష్ట హామీ మొత్తం 50,000 రూపాయలుగా ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి. అలానే ఈ పాలసీ తీసుకుంటే లోన్ ని కూడా తీసుకునే అవకాశం వుంది. ఒకవేళ పాలసీ సరెండర్ చేస్తే డిపాజిట్ మొత్తంలో 30 శాతం నుంచి 90 శాతం వరకు పొందవచ్చు.