కార్పెంటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన ఆ యువకుడు ఇప్పుడు వీకీపీడియా కంటెంట్ సమీక్షుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా థడియా కుగ్రామంలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన రాజు, ఓ వైపు చదువు కొనసాగిస్తునే మరోవైపు కార్పెంటర్ (వండ్రంగి)గా పనిచేసేవాడు. రాజుకు వికీపీడియాలో ఆర్టికల్స్ చదవడం చాలా ఇష్టపడేవాడు. చదువైనా, పనైనా అందుకు సంబం«ధించి ఎలాంటి వివరాలు, సమాచారం కోసం రాజు వెంటనే వికీపీడిలోనే అన్వేషించేవాడు. అయితే ఆ సమాచారాన్ని హిందీలోనే వెతికేవాడు. ఓ సారి తన గ్రామంతో పాటు పరిసరా ప్రాంతాలను వికీపిడీయాలో అన్వేషిస్తుండగా ఎంతకూ దొరకలేదు. రాజ్యభాష హిందీ అయినా సమాచారం ఎక్కువగా లేకపోవడం ఏంటని.. వికీలో హిందీ భాషలో ఎక్కువ సమాచారంలో అందించాలని నిర్ణయించుకొని వికిపీడియా వలంటీర్‌గా చేరి హిందీలో ఆర్టికల్స్ రాయడం ప్రారంభించాడు.
8వ తరగతిలోనే..
ఆ విధంగా రాజు 8వ తరగతిలో ఉన్నప్పుడే కంటెంట్ రైటర్‌గా మారాడు. రాస్తురాస్తూ తన గ్రామం చుట్టుపక్కల సమాచారాన్ని అక్కడి అధికారులతో మాట్లాడి వికీపీడియాలో పోస్ట్ చేసేవాడు. అలా పదవ తరగతి పూర్తయినా తన ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు రాకపోవడంతో చదువు మానేసి మళ్లీ వడ్రంగి పనిలో చేరాడు. పనిచేసుకుంటునే సమయం దొరికినప్పుడల్లా ఆర్టికల్స్‌ను రాస్తూ, పేజీలను ఎడిట్ చేసేవాడు. రాజు పనితనం నచ్చడంతో తన పరిస్థితి తెలుసుకున్న వికీపీడియా నిర్వాహకులు అతడికి ల్యాప్‌టాప్‌ను బహుమతిగా ఇచ్చి ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించారు.
ఇక్కడి నుంచి మలుపు..
ల్యాప్‌టాప్ వచ్చినప్పటి నుంచి రాజు హైక్వాలిటీ కంటెంట్ ఇవ్వడంతోపాటు వికీపీడియా ఎడిటర్‌గా ఎన్నో సైబర్ కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యాడు. ఇప్పటిదాక 57 వేల వికీపీడియా పేజీల ఎడిట్‌తో పాటు 1,880 ఆర్టికల్స్‌ను రాశాడు.మనలో ఎన్ని నైపుణ్యాలున్నా పరిస్థితులతో పోరాడకపోతే గెలవలేమని రాజు చెబుతున్నాడు. ‘2013, 2014లో వికీలో ఆర్టికల్స్‌ను అప్‌లోడ్ చేసేవాడిని.. కానీ వికీ అడ్మిన్లు నా ఆర్టికల్స్‌ను బ్లాక్ చేసేవాళ్లు. అలా ఎన్నోసార్లు జరిగిన తరువాత.. అసలు వికీవాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని వాటిపై దృష్టి సారించానన్నాడు. ‘స్మార్ట్‌ఫోన్ ద్వారా 150– 200 పదాల ఆర్టికల్స్‌ను రాసేవాడిని. అయితే కీబోర్డు చాలా కష్టంగా అనిపించేది. ఆ తరువాత ల్యాప్‌టాప్ రావడంతో 400 పదాలకు పైగా ఆర్టికల్స్‌ను రాయగలిగాన’ని రాజు చెప్పాడు.
11 మందిలో ఒకడు..
2017లో కార్పెంటర్ ఉద్యోగం మానేసిన రాజు మధ్యలో ఆగిపోయిన తన చదువును కొనసాగించి బీఏ పూర్తిచేశాడు. సైబర్ ఎడిటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వికీ స్పెషల్ ప్రాజెక్ట్ ‘వికీ స్వస్థ’కు పనిచేస్తున్నాడు. హిందీలో వికీ క్రికెట్ ప్రాజెక్ట్ ప్రారంభించి 700 ఆర్టికల్స్‌ను కంట్రిబ్యూట్ చేశాడు. అయితే దేశంలో హిందీ వికీలో మొత్తం 11 మంది మాత్రమే యాక్టివ్ కంట్రిబ్యూటర్లు ఉండగా అందులో రాజు కూడా ఒక్కడు.