సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు రాజకీయం చాలా వరకు భిన్నంగా ఉంటుంది. తనను నమ్మిన వారిని ఆయన నమ్మే అవకాశం ఉండదు అని అంటారు. ఆయన నమ్మే వారు ఆయనను నమ్మే అవకాశం ఉండదు అని చెప్తూ ఉంటారు. ఆయన చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చిన నేతలు ఆయన విషయంలో ముందు నుంచి కూడా కాస్త వివాదాస్పదంగా లేదా తేడాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆయనను వాళ్ళు మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా ఆయన నమ్మే ప్రయత్నం కూడా చేస్తారు అంటూ ఉంటారు.
ఇప్పుడు దాదాపుగా అదే జరుగుతుంది అనేది చాలా మంది మాట్లాడే మాట. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు బలపడకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ నిలబడటం చాలా కష్టం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడే చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలు సహా కొన్ని కొన్ని విషయాల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా లేదా ఆయన ఏది మాట్లాడినా లేదా ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చూసినా సరే కొన్ని కొన్ని ముందే జగన్ కి వెళ్తున్నాయి.
పార్టీలో సీనియర్ నేతలకు తెలిసే ముందే.. జగన్ వద్దకు లైవ్ కూడా వెళ్తుంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ప్రతీ ఒక్కటి కూడా జగన్ ముందే వింటున్నారు అని అంటున్నారు. చంద్రబాబుకి ఈ విషయం తెలిసినా సరే వాళ్ళను పక్కనే కూర్చోపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అని ఇలాంటి రాజకీయమే తెలంగాణా లో జరిగి పార్టీ ఇబ్బంది పడింది అని అంటున్నారు. పార్టీలో సీనియర్ నేతలు కొందరు నిజాయితీ గా లేరు అని అయినా సరే చంద్రబాబు వారికి ఎక్కడ లేని ఆదరణ కల్పిస్తున్నారు అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.