ఇండియాకు వచ్చే ఈ దేశాల వాళ్లు మరిన్ని కోవిడ్ నిభందనలు పాటించాల్సిందే..

-

ప్రపంచంలో పలు దేశాల్లో కోవిడ్ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలతో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో గత కొన్ని వారాల నుంచి కోవిడ్ తీవ్రత పెరుగుతోంది. ఆ దేశాల్లో థర్డ్ వేవ్ ముప్పు మొదలైందా.. ? అనే సందేహాలు కలుగుతున్నాయి. పెరుగుతున్న కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కలవరం వ్యక్తం చేస్తోంది.

తాజాగా భారత దేశం కూడా పలు దేశాలకు అదనంగా మరికొన్ని కోవిడ్ నిభందనలను తీసుకువచ్చింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు, యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్‌తో దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు మరికొన్ని కోవిడ్ ఆంక్షలు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఈదేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారత ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. ప్రయాణానికి ముందు, ప్రయాణం తరువాత కోవిడ్ టెస్ట్ ను తప్పనిసరి చేసింది. ఇండియా వచ్చిన తర్వాత 14 రోజుల పాటు స్వయంగా ఆరోగ్యాన్ని పరిశీలించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. 

Read more RELATED
Recommended to you

Latest news