covishield : కోవిషీల్డ్ బూస్ట‌ర్ డోస్ ధ‌ర రూ. 600.. అద‌ర్ పూనావాలా ప్ర‌క‌ట‌న

-

దేశంలో 18 ఏళ్లు దాటిన వారికి బూస్ట‌ర్ డోస్ పంపిణీ చేస్తున్నట్టు కేంద్ర ప్ర‌భుత్వం ఈ రోజు ప్ర‌క‌ట‌న చేసిన విషయం తెలిసిందే. అయితే బూస్ట‌ర్ డోస్ ధ‌ర ఎంత ఉంటుందో అనే చర్చ అప్పుడే దేశంలో మొద‌లైంది. క‌రోనా టీక ధ‌ర పాత ప‌ద్ధ‌తిలోనే ఉంటుంద‌ని కొంతమంది, బూస్ట‌ర్ డోస్ ధర పెంచే అవ‌కాశం ఉంద‌ని మ‌రి కొంత మంది అభిప్రాయ ప‌డ్డారు. అయితే తాజా గా బూస్ట‌ర్ డోస్ ధ‌ర పై సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అద‌ర్ పూనావాలా స్పందించారు.

కోవిషీల్డ్ బూస్ట‌ర్ డోస్ ధ‌ర రూ. 600 ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. అన్ని ప‌న్నుల‌ను క‌లుపుకుని బూస్ట‌ర్ డోస్ ధ‌ర‌ను రూ. 600 గా నిర్ణ‌యించామ‌ని తెలిపారు. అలాగే సీరం ఇన్ స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న కొవోవాక్స్ బూస్ట‌ర్ డోస్ కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమతి ఇస్తే.. రూ. 900 అందిస్తామ‌ని సీరం ఇన్ స్టీట్యూబ్ సీఈవో అద‌ర్ పూనావాలా ప్ర‌క‌టించారు. కాగ కేంద్ర ప్ర‌భుత్వ బూస్ట‌ర్ డోస్ పంపిణీపై ప్ర‌క‌టన చేయ‌డంపై సంతోషం వ్య‌క్తం చేశారు. చాలా దేశాలు ఇప్ప‌టికే బూస్ట‌ర్ డోసును పంపిణీ చేస్తున్నాయ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version