నెలకు 75 లక్షలు మేకప్..ప్రధాని మోడీ ఓ సన్యాసి అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ. బలహీన ప్రధాని కూడా ఆస్తులు అమ్మలేదని.. బలమైన ప్రధాని అని చెప్పే మోడీ 24 పబ్లిక్ ఆస్తులు అమ్మేశారని మండిపడ్డారు. 28 మంది బ్యాంకుల లూట్ చేస్తే… దేశం విడిచి పోతే పట్టించుకోలేదని.. దేశం విడిచిన వాళ్లంతా గుజరాత్ వాళ్ళేనని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో బ్యాంకులను లూటి చేసిన వాళ్ళను జైల్లో పెట్టారని.. అప్పుల ఎగవేత దారులు కూడా మోడీ హయాంలో పెరిగిందని ఆగ్రహించారు. పెద్ద నోట్లు రద్దు అని… బడా కంపెనీ ల బ్లాక్ మనీ వైట్ అయ్యిందని.. కాంగ్రెస్ నేతల అవినీతి చిలక కొట్టుడన్నారు.
బీజేపీ..అవినీతి హోల్ సేల్ అని… నెలకు 75 లక్షలు మేకప్ టీం వాడిన ప్రధాని లేడని ఆగ్రహించారు. జపాన్ పోతే 14 డ్రెస్ లు మార్చారు… మళ్లీ నేను మోడీని సన్యాసి అంటానన్నారు. గడ్డం పెంచినంత మాత్రానా సన్యాసి కాదు.. సోకులు పడు కానీ..పబ్లిక్ సెక్టార్ ను ఎందుకు దొచేస్తున్నావని ఫైర్ అయ్యారు.