సుప్రీంకోర్టును ఆశ్రయించిన ‘శివసేన’.. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని పిటిషన్!

-

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులతో సస్పెన్స్ కొనసాగుతోంది. రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా నడిచింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేశారు. బీజేపీ ఆదేశాల మేరకు మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరించారు.

సీఎం ఉద్ధవ్ ఠాక్రే
సీఎం ఉద్ధవ్ ఠాక్రే

అయితే అనూహ్యంగా శివసేన శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అనర్హత తేలేంతవరకు 16 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం విచారణను ఈ నెల 11వ తేదీ వరకు వాయిదా వేసింది. అంతకుముందు శివసేన పార్టీ సీఎం ఏక్‌నాథ్ షిండేతోపాటు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. దీంతో మహారాష్ట్రలో ఈ నెల 3, 4 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news