నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సిపిఎం నేతలు భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర పార్టీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సిపిఎం సెంట్రల్ కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు. ఈ భేటీలో మునుగోడు ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.
అలాగే సెప్టెంబర్ 17న బిజెపి వ్యతిరేక పోరాటం, భవిష్యత్తులో కలిసి పని చేసే అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే శుక్రవారం ఈ భేటీ జరగవలసి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఈరోజు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ తో సిపిఎం నేతలు భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ వామపక్షాల మద్దతు కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ కు సిపిఐ మద్దతు ప్రకటించగా.. తాజాగా సిపిఎం కూడా మద్దతు తెలిపింది.