మహేశ్ బాబు సరసన ఐశ్వర్యా రాయ్ ..సూపర్ స్టార్ అభిమానులకు రాజమౌళి సర్ ప్రైజ్!

-

మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్ రజనీకాంత్ సరసన మరోసారి హీరోయిన్ గా నటించబోతున్నదని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. కాగా తాజాగా మరో వార్త నెట్టింట హల్ చల్ అవుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే తదుపరి సినిమా లో ఫిమేల్ లీడ్ రోల్ కోసం ఐశ్వర్యారాయ్ ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట.

ఈ విషయం తెలుసుకుని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. RRR వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోయే మహేశ్ బాబు సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ నటిస్తే ఇక సినిమా సూపర్బ్ గా ఉంటుందని అనుకుంటున్నారు.

ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. RRR ఫిల్మ్ స్టోరి రైటర్, రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. మరో వైపున మహేశ్ ..తన స్నేహితు డు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 ఫిల్మ్ చేస్తున్నారు. చూడాలి మరి..రాజమౌళి దర్శకత్వంలో రాబోయే మహేశ్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు ఫైనల్ అవుతారో..

Read more RELATED
Recommended to you

Latest news