తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమె కూతురుతో కూడా రాసలీలలకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక గర్భం కూడా దాల్చింది. ఈ దారుణమైన సంఘటన కృష్ణా జిల్లా మచిలీ పట్నంలో చోటు చేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళితే… మచిలీపట్నంలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు నిందితుడు. ఈ నేపథ్యంలోనే ఆమె కుమార్తె పై ఘాతుకానికి ఒడిగట్టాడు.
తండ్రి స్థానంలో ఉన్నసదరు వ్యక్తి…. పది నెలలుగా బాలిక పై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీంతో.. బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా గుర్తించిన బంధువులు.. ఆస్పత్రిలో చేర్పించగా.. ప్రభుత్వాస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అవమాననీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ట్యాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్న నిందితుడు సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిలకలపూడి పోలీస్ స్టేషన్ లోకేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.