నాపేరు శివ, డిటెక్టివ్ సినిమాల్లో లాగే శవాన్ని మాయం చేసే ప్లాన్.. భార్యే ప్లాన్ చేసి ఘాతుకం..

-

నూరేళ్ల పాటు కలిసి ఉంటా.. అని ప్రమాణం చేసిన భార్యే.. హంతకురాలిగా మారింది. అక్రమ సంబంధం కోసం సొంత భర్తనే అత్యంత పాశవికంగా కడతేర్చింది. నాపేరు శివ, డిటెక్టివ్ సినిమాల్లోలాగే శవాన్ని మాయం చేద్దాం అనుకుని.. తలను, మొండాన్ని వేరు చేసి ఒక్కోచోట పడేశారు. చివరకు పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యారు. అక్రమ సంబంధంతో ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది. తాజాగా పోలీసుల విచారణలో నిందితులిద్దరు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే ఇటీవల పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జ్యోతినగర్ లో దారుణం చోటు చేసుకుంది. ప‌ట్టణానికి చెందిన కాంప‌ల్లి శంక‌ర్ అనే యువ‌కుడు స్థానికంగా ఓ మీసేవ‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శంక‌ర్ క‌నిపించ‌కుండా పోవ‌డంతో అత‌డి కుంటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా న‌మోదు చేసుకున్నారు. ఇటీవల అతనిని హత్య చేసి తలం మొండెం వేరు చేసి పడేశారు.

ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకున్న గోదావరిఖని పోలీసులు విచార‌ణ జరిపారు. తాజాగా పోలీసులు జరిపిన విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. భార్య ఆమె ప్రియుడు కలిసే భర్తను హత్య చేసినట్లు తెలిసింది. భార్య హేమలత, ఆమె ప్రియుడు పాయల రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. నిందితుల నుంచి ఓ కత్తి, పగిలిన బీరు సీసా, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.

ఓ హాస్పిటల్ లో నర్సుగా పనిచేసే హేమలతకు, అదే హాస్పిటల్  లో పనిచేస్తున్న స్వీపర్ గా పనిచేసే పాయల రాజుకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త శంకర్ కు తెలియడంతో హేమలతను శారీరకంగా.. మానసికంగా వేధించేవాడు. భర్త పెడుతున్న టార్చర్ గురించి రాజుకు తెలపడంతో .. శంకర్ ను చంపాలని ప్లాన్ చేశారు. అతడిని అడ్డు తొలగించుకుంటే తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చిన శంకర్ ను హత్య చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news