హైదరాబాదులో కొత్త తరహా నేరం.. రోడ్డుపైన యువకుడితో కనిపిస్తే..

-

హైదరాబాద్ లో కొత్త తరహా నేరం వెలుగు చూసింది. ఇన్స్టా గ్రామ్ లో “జముండా అఫిషియల్” అనే అకౌంట్ పేరుతో పేట్రేగిపోతుంది ముఠా. ఒక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. రోడ్ల పై ఎక్కడైనా ఓ యువతి యువకుడితో కనిపిస్తే వీడియోలు తీస్తూ ఇన్స్తా లో పోస్ట్ లు పెడుతున్నారు. సదరు మహిళ పై అభ్యంతర పోస్ట్ లు చేస్తూ.. తమ కమ్యూనిటీనీ డామేజ్ చేస్తున్నారంటూ మహిళకు ట్యాగ్ లైన్ ఇస్తు పోస్ట్ లు చేస్తున్నారు.

ఝాముండ అఫిషియల్ కు ఇన్స్స్టా లో 12 వేల ఫాల్లోవర్లు ఉన్నారు. మొత్తం 900 మంది యువకుల వీడియోలు తీసే పనిలో ఉన్నారని స్టేటస్ పెట్టాడు అడ్మిన్. వీరి ఆగడాలు తట్టుకోలేక పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఝాముండ పేజ్ పై ఇప్పటివరకు 3 కేసులు నమోదు చేసారు సైబర్ క్రైమ్ పోలీసులు. 506, 509 , 354(d) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పేజ్ నిర్వాహకుల పూర్తి డేటా ఇవ్వాలని ఇన్ స్టాగ్రం కు లేఖ రాశారు హైదరాబద్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news