పాతబస్తీ షాహిన్ నగర్ లో అర్ధరాత్రి ఆటో డ్రైవర్ దారుణ హత్య

-

హైదరాబాదులోని పాతబస్తీ షాహిన్ నగర్ లో అర్దరాత్రి ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. బాలాపూర్ పోలీస్టేషన్ పరిధి షాహిన్ నగర్ ప్రాంతానికి చెందిన సల్మాన్ ఛావూస్ అనే యువకుని హత్యచేసారు నలుగురు స్నేహితులు. హత్య చేసిన నిందితుల కోసం గాలిస్తూన్నారు పోలీసులు. అర్దరాత్రి ఒంటి గంటకు ఛావూస్ స్నేహితులు సయ్యద్ అమేర్, మహమ్మద్ జాహేర్, మహమ్మద్ మహబూబ్, షేక్ సోహేల్ కలిసి ఎస్-ప్రీసియో కార్ లో రాయల్ హోటల్ కు వెళ్ళారు.

రాయల్ హోటల్ లో టి తాగి అక్కడి నుండి కారులో ఎర్రకుంట వెళ్ళి నిర్మాణుష ప్రాంతంలో ఛావూస్ ను కత్తితో కడుపులో పొడిచి హత్యచేశారు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఛావూస్ హత్యకు కారకులైన నింధితులకోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news