రాచకొండలో బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠా అరెస్ట్

రాచకొండలో బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠాని అరెస్ట్ చేశారు మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు. నకిలీ పేర్ల మీద అకౌంట్లు సృష్టించి వారి పేర్ల మీద లోన్స్ తీసుకొని ఎగ్గొడుతున్న ఐదుగురు నిందితులను మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ కంపెనీ సృష్టించి క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ పేరుతో 2.50 కోట్లు రుణం తీసుకున్నారు. వీరు వరంగల్ నుండి అమాయకులను తీసుకొచ్చి ఆధార్ కార్డ్స్, ఫొటోస్ పెట్టి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. వీరి వద్ద నుండి 93 కార్డ్స్, డెబిట్ కార్డ్స్ , 28 పాన్ కార్డు, 54 ఆధార్ కార్డు స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంక్ నుండి తీసుకున్న డబ్బులతో ప్రతిరోజు నోవోటల్ లో కుటుంబంతో బస చేసాడు ఓ నిందితుడు. పూణే,గోవా, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో జల్సా చేసినట్లు గుర్తించారు. ఖరీదైన బట్టలు, షూస్, వాచ్, సెల్ ఫోన్స్ లతో జల్సా చేసినట్లు తెలిపారు. 100 కీలోల బరువును తగ్గి గుర్తు పట్టకుండా స్లిమ్ గా మారాడు నిందితుడు. బ్యాంక్ అధికారుల పిర్యాదు పై కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు ఎస్ఓటి పోలీసులు.