యాదాద్రిలో ఘోర ప్రమాదం..రైలులో ఒక్కసారిగా మంటలు !

యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా పగిడిపల్లి వద్ద రైలులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. భువనగిరి (మ) పగిడిపల్లి రైల్వేస్టేషన్ లో అర్ధరాత్రి దక్షిణ ఎక్స్ ప్రెస్ పార్సిల్ బోగీ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అలర్ట్‌ అయిన ఫైర్ సిబ్బంది.. వెంటనే మంటలు ఆర్పింది.

అయితే..ఈ ప్రమాదం జరుగడంతో…. దక్షిణ ఎక్స్ ప్రెస్ చివరి లగేజీ బోగీని స్టేషన్లోనే వదిలి వెళ్లింది రైలు, ఇక ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా అగ్నికి ఆహుతైంది బోగీ లోని సామాగ్రి. అటు ప్రయాణికులు పరుగులు తీసినట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.