శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దుబాయి నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. రెండు కేసుల్లో ముగ్గురుని అదుపులోకి తీసుకుని వారి నుంచి 7.69 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వివరించారు.

గురువారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా 4.895 కేజీల బంగారం పట్టుబడింది. సిలిండ్రకల్‌ సిల్వర్‌ కోటెడ్‌ బ్లాక్‌లో బంగారం తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. మరో ఇద్దరు ప్రయాణికులు లో దుస్తుల్లో తీసుకొచ్చిన 2.800 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వివరించారు.
రెండు విమానాల్లో దుబాయి నుంచి అక్రమంగా తెచ్చిన 7.69 కిలోల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే.