హైదరాబాద్ లో దారుణం…స్కూల్ పిల్లలపై ప్రిన్సిపాల్ కుమారుడి లైంగిక దాడి

-

హైదరాబాద్ సంతోష్ నగర్ లో అమానుషం చోటు చేసుకుంది. స్కూల్ పిల్లలపై ప్రిన్సిపాల్ కుమారుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడు యాసర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సెక్షన్ 354(a), 509, 9(m) r/w pocso act 2012 కింద కేసులు నమోదు చేసి.. బొక్కలో వేశారు పోలీసులు. న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి బెదిరింపులు దిగిన యాసర్‌, పలువురు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం.

మైనర్ బాలికపై అత్యాచారం

ఈ నేపథ్యంలోనే పలు న్యూడ్ సె‌ల్ఫీ వీడియోస్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొయిన్ బాగ్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ లోనే నిందితుడి కుటుంబం నివాసం ఉండటంతో రెచ్చిపోయాడు. తల్లి ప్రిన్సిపాల్ కావటంతో ఆసరగా చేసుకుని స్కూల్ పిల్లల పై అఘాయిత్యం చేశాడు యాసర్‌. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు తో వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన. గత కొంతకాలంగా చాలా మంది చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించిన పోలీసులు.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news