పెళ్లైన వ్యక్తితో లేడీ డాక్టర్ శృంగారం.. అందరూ చూస్తుండగానే !

రాజస్థాన్ మధురదాస్ లోని ఓ ఆసుపత్రిలో సోనాలి(29) డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తుంది. పై చదువులు చదివి డాక్టర్ కలను నిజం చేసుకుంది. అలా ఆమె జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలోనే కొలీగ్ డాక్టర్ అయినా అంకిత్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇతనికి ఇదివరకే పెళ్లి అయింది. ఒకే ఆస్పత్రిలో పనిచేస్తుండడంతో ఇద్దరు కాస్త సన్నిహితంగా మెలిగారు.

ఇక రాను రాను వీరి పరిచయం చివరికి ప్రేమించుకునే దాకా వెళ్ళింది. దీంతో సమయం దొరికినప్పుడు సినిమాలకు, షికారులకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంకిత్ ప్రేమలో మునిగిపోయిన సోనాలి నేను పెళ్లి చేసుకుంటే ఇతడినే చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయింది.

అయితే ఈ క్రమంలోనే అంకిత్ ప్రేమ వ్యవహారం అతని భార్యకు చెవిన పడింది. ఇక కోపంతో ఊగిపోయిన అంకిత్ భార్య సోనాలి ఉంటున్న హాస్టల్ కు వెళ్లి అందరి ముందే సోనాలిని అనరాని మాటలు అనేసింది. అంకిత్ కు దూరంగా ఉండాలని హెచ్చరించడంతోపాటు, సోనాలి తల్లిదండ్రులకు కూడా ఆమె సాగిస్తున్న ప్రేమ విషయాన్ని చెప్పింది. ఇక అందరి ముందు నా పరువు పోయిందని భావించిన సోనాలి తీవ్రమనస్థాపానికి లోనైంది. ఆ తర్వాత నోట్ రాసి చివరికి ఆత్మహత్య చేసుకుంది.