రియ‌ల్ట‌ర్ల హ‌త్య కేసులో ఆరుగురు అరెస్ట్.. సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ ప్ర‌క‌ట‌న

-

ఇటీవల ఇబ్ర‌హీంప‌ట్నంలో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న యావ‌త్ రాష్ట్రాన్ని వ‌ణికించింది. ఇద్ద‌రు రియ‌ల్ట‌ర్ల‌పై కొంత మంది దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. కాల్పులు శ్రీ‌నివాస్ రెడ్డి అనే రియ‌ల్ట‌ర్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. అలాగే రాఘ‌వేంద‌ర్ రెడ్డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. కాగ ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కాల్పుల ఘ‌ట‌నలో ఉన్న మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కేసు వివ‌రాల‌ను రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ మీడియాకు వివ‌రించారు. కాల్పులు జరిగిన త‌ర్వాత స‌మాచారం రావ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నామ‌ని అన్నారు.

CP_Mahesh_Bhagwat
CP_Mahesh_Bhagwat

ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి సాంకేతికంగా దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించిన‌ట్టు తెలిపారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని ఆరెస్టు చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. ప్రధాన నిందితుడు అశోక్ రెడ్డి అలియాస్ ఇంద్రసేనారెడ్డి అని తెలిపారు. అలాగే అక్క‌డి గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్న ఖాజా మొయినుద్దీన్, భిక్షపతి, సయ్యద్ రహీమ్, షబ్బీర్ అలీ, రాజివ్ ఖాన్ లను అరెస్టు చేశామ‌ని తెలిపారు. వీరిలో షబ్బీర్ అలీ, రాజీవ్ బీహార్ కి సంబంధించిన వాళ్ళని వివ‌రించారు. కాగ భిక్షపతి, ఖాజా మొయినుద్దీన్ లో కాల్పులు జరిపారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news