ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఫేక్ డాక్టర్ భాగోతం గుట్టురట్టు చేసినట్లు తెలిపారు రాచకొండ సిపి మహేష్ భగవత్.ఎల్బీనగర్ రాక్టౌన్ కాలినీలో ఆర్కే హాస్పటల్ లో ఎండి ఫిజీషియన్ గా చలామని అవుతున్న ఫేక్ డాక్టర్ కుదిలెట్టి విజయ్ కుమార్ నీ అరెస్ట్ చేశారు ఎస్వోటి పోలీసులు.నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ కు చెందిన విజయ్ కుమార్,2014 లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో బిఎస్సీ పూర్తి చేశాడు.
నగరంలోని పలు హాస్పిటల్ లో కాంపౌండర్ గా పనిచేసిన విజయ్..అప్రోజ్ ఖాన్ తో పరిచయం అయ్యాడు.విజయ్ కి నకిలీ సర్టిఫికెట్స్ ఇప్పిస్తానని అప్రోజ్ చెప్పాడనీ..సర్టిఫికెట్స్ ఇప్పించి నందుకు అప్రోజ్ కు 2 లక్షలు కమిషన్ ఇచ్చినట్లు తెలిపారు.రష్యా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ పేరుతో ఫేక్ సర్టిఫికెట్ కొనుగోలు చేశాడని తెలిపారు సిపి మహేష్ భగవత్.మొత్తం 6 లక్షల 50 వేలకు సర్టిఫికేట్స్ కొనుగోలు చేసాడు.మొత్తం ఈ కేసులో ముగ్గురుని అరెస్ట్ చేసామని తెలిపారు.
ఫేక్ సర్టిఫికెట్ తయారుచేసిన మహబూబ్ అలీ జునైద్, అఫ్రోజ్ ఖాన్ లను అరెస్ట్ చేశారు.పక్క సమాచారం మేరకు విజయ్ పై ద్రుష్టి సారించామనీ తెలిపారు.ఇలాంటి నకీలీ సర్టిఫికెట్స్ తో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు.గత సంవత్సరం నుండి విజయ్ వివిధ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్నాడనీ..నకిలీ డాక్టర్ దగ్గర నుండి నకిలీ సర్టిఫికెట్స్, ఒక కార్, రెండు పాస్ పోర్ట్స్ స్వాదినం చేసుకున్నట్లు తెలిపారు.