బిల్కిస్ బావో కేసులో దోషులకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు ..!

-

బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలని 11 మంది దోషులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లలో న్యాయం లేదని పేర్కొంది. దోషులు ఈనెల 21 వరకు జైలులో లొంగిపోవాలని ఆదేశించింది. బిల్కిస్ బానో కేసులో తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 

వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దోషుల్లో ఒకరు గోవింద్ భాయ్.. 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యతను పేర్కొంటూ గడువు పొడగింపును కోరారు. తల్లిదండ్రులకు ఏకైక సంరక్షకుడినని పేర్కొన్నారు. దోషి రమేష్ రూపాభాయ్ చందన తన కుమారుడి పెళ్లికి సమయం కావాలని.. ఆరు వారాల పొడగింపు కోరాడు. మూడో దోషి మితేష్ చిమన్ లాల్ భట్ కూడా ఆరు వారాల పొడగింపును అభ్యర్థించాడు. శీతాకాల పంట కోతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. అయినప్పటికీ సుప్రీంకోర్టు.. మళ్లీ జైలులో జనవరి 21లోపు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version