తమిళనాడులో రిఫ్రిజిరేటర్ పేలి ముగ్గురు మృతి

-

తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉర్పక్కం ప్రాంతంలో ఓ అపార్ట్​మెంట్​లోని మొదటి అంతస్తులో రిఫ్రిజిరేటర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అపార్ట్​మెంట్​లో గిరిజ అనే మహిళ, ఆమె బంధువులు రాధ, రాజ్​కుమార్, రాజ్​కుమార్ భార్య భార్గవి, వారి కుమార్తె ఆరాధన నిద్రిస్తుండగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో షార్ట్​ సర్క్యూట్ వల్ల రిఫ్రిజిరేటర్‌ పేలిపోయింది.

పేలుడు వల్ల విపరీతమైన పొగ వచ్చింది. నిద్రిస్తున్న వారంతా పొగలో చిక్కుకున్నారు. వారి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. తలుపులు తెరిచి చూసేసరికి అప్పటికే రాజ్‌కుమార్, రాధ, గిరిజ ఊపిరాడక మృతి చెందారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్గవి, ఆరాధనలను క్రోంపేట ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news