జహీరాబాద్ యువతి అత్యాచార ఘటనలో ట్విస్ట్

ఇటీవల జహీరాబాద్ సమీపంలో ఓ యువతిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. అనుమానాస్పద స్థితిలో మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మహిళను సఖి కేంద్రానికి తరలించారు.

అయితే ఈ కేసులో యువతని విచారించగా.. పోలీసులను బురిడీ కొట్టించి యువతి కట్టు కధ అల్లినట్లుగా తెలుస్తోంది. గ్యాంగ్ రేప్ అన్నది బూటకమని అనుమానిస్తున్నారు పోలీసులు. తనకి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలున్నా పెళ్లి కాలేదని పోలీసులకు చెబుతోంది యువతి. భర్తతో గత కొంత కాలంగా దూరంగా ఉంటుంది యువతి. విచారణలో బాధిత యువతి పొంతన లేని మాటలు చెబుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి హైదరాబాద్ లో సిసి కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది.

ఇప్పటికే హైదరాబాద్ లోని కూకట్ పల్లి, తిరుమల గిరి, బోయినపల్లిలో సిసి కెమెరాలను పరిశీలించారు జహీరాబాద్ పోలీసులు. ఈ నెల 22న మద్యం మత్తులో ఉన్న బాధిత యువతిని బాలానగర్ పోలీసులకు స్థానికులు అప్పగించినట్లు గుర్తించారు పోలీసులు. యువతికి రోజంతా కౌన్సిలింగ్ ఇచ్చారట బాలానగర్ మహిళా పోలీసులు. ఈ నెల 23న జహీరాబాద్ కు ఎలా వచ్చింది అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి తప్పుడు సమాచారం ఇస్తుండటంతో తల పట్టుకుంటున్నారు పోలీసులు.