ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్‌ ఛీటింగ్‌.. విగ్గుతో ఎంట్రీ..కనిపెట్టేసిన పోలీసులు

-

ఎంత ఎక్కువ శాలరీ వచ్చినా..ఈ సమాజంలో గవర్నమెంట్ జాబ్ కు ఉన్న రేంజే వేరు. అదేంటో శాలరీ కాస్త తక్కువైనా సరే..ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలు అనుకుంటారు. యువత కూడా ఏళ్లు గడిచినా..కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ధోరణిలోనే ఉన్నారు. మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా కచ్చితంగా ఒకరైనా ఉంటారు..కాంపిటీటీవ్ ఎగ్జామ్స్ కి తెగ ప్రిపేర్ అయ్యేవాళ్లు. అయితే కొంతమంది కష్టపడి చదివితే..మరికొందరు అడ్డదారుళ్లో వెళ్లి జాబ్ కొట్టాలనుకుంటారు. తాజాగా హైటెక్ కాపీయింగ్ చేస్తూ ఓ అభ్యర్థి అడ్డంగా దొరికిపోయాడు. విగ్గు పెట్టుకోంచి ఎగ్జామ్ కి వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

యూపీలో సబ్‌ఇన్స్‌పెక్టర్‌ మెయిన్స్‌ రాతపరీక్షలు జరుగాయి. దీనిలో ఒక అభ్యర్థి పరీక్ష కేంద్రానికి వచ్చాడు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. దీంతో.. ప్రత్యేక అధికారులు అతడిని బయటకు తీసుకెళ్లి క్షతనిఖీ చేశారు. ఆ యువకుడిని పూర్తిగా పరిశీలించారు. ఎక్కడ కూడా ఎలాంటి కాపీయంగ్‌ ఆనవాళ్లు దొరకలేదు. చివరకు వారు అతగాడి తలపైన తనిఖీ చేశారు. అతడి జుట్టును పక్కకు జరిపి చూశారు. అప్పుడు షాకింగ్‌ ఘటన వెలుగులోనికి వచ్చింది. యువకుడి తలపైన ఒక విగ్‌ మాదిరిగా వెంట్రుకలు ఉన్నాయి.

అనుమానం వచ్చి తీసిన పోలీసులకు దానికింద ప్రత్యేక చిప్‌, బ్లూటూత్‌లు కనిపించాయి. దీన్ని చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఆ తర్వాత.. యువకుడిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ హైటెక్‌ మాస్‌కాపీయంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడి మాస్ కాపీయింగ్ రా బాబు అని తెగ కామెంట్ చేస్తున్నారు.

కష్టపడి చదివి మంచిమార్గంలో వెళ్లినప్పుడే విజయం సిద్ధిస్తుంది. ఇలాంటి చెడ్డదారులో వెళ్తే దొరికిపోయి, పరువుపోయి..ఇక ఎప్పటికీ పరీక్షలు రాయడానికి లేకుండా అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news