మూఢనమ్మకంతో..పసిబిడ్డను కిడ్నాప్‌ చేసిన యువతి..ఆపై ఏం చేయాలనుకుందంటే..!!

-

ఈ రోజుల్లో కూడా చాలామంది.. మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతున్నారు.. మంచి జరుగుతుందనే నమ్మకం.. చెడు జరుగుతుందనే భయం..మనిషితో ఏదైనా చేయిస్తుంది. ఎదుటివారికి హాని చేయడానికి కూడా వెనకాడరు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ దారుణ సంఘటన ఇందుకు సాక్ష్యంం.. శ్వేత అనే పాతికేళ్ల యువతి అనారోగ్యంతో చనిపోయిన తండ్రి బ్రతకడానికి ఓ క్షుద్రపూజలు చేసే వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి…తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందును కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఏం చేసిందంటే..
శ్వేత అనే మహిళ తండ్రి అనారోగ్యంతో మరణించాడు. అయితే చనిపోయిన తండ్రి బ్రతకాలంటే ఒక మగబిడ్డను బలిస్తే తండ్రి పునర్జీవం పోసుకుంటాడని మంత్రగాడు చెప్పడంతో నిజమే అని బలంగా నమ్మింది. బలిచ్చేందుకు కావాల్సిన మగబిడ్డ కోసం ఆసుపత్రికి వెళ్లి ఓ పసికందును ఎత్తుకొని పోయింది. ఢిల్లీలోని సఫ్లర్‌జంగ్‌ ఆసుపత్రికి వెళ్లి అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రసూతి మహిళ బంధువులను పరిచయం చేసుకుంది. వారితో సాన్నిహిత్యం పెంచుకుంది. ఆ తర్వాత తల్లి ఒడిలో పడుకున్న పసికందును తీసుకొని మళ్లీ తెస్తానని చెప్పింది.
ఆసుపత్రిలో మగబిడ్డను శ్వేత తీసుకెళ్తుండగా శిశువు తల్లి తన మేనకోడలు రీతును శ్వేతతో పంపించింది. పసిబిడ్డను తీసుకెళ్లాలని పక్కా ప్లాన్ వేసుకున్న శ్వేత తన వెంట వచ్చిన రీతుకు మత్తు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయేలా చేసింది. అంతే..ప్లాన్‌ ప్రకారం.. పసికందును తీసుకొని కారులో పారిపోయింది. మత్తు వీడిన తర్వాత రీతు పసిపిల్లవాడ్ని ఎత్తుకెళ్లిన శ్వేత విషయాన్ని పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొబైల్ ట్రేస్ టెక్నాలజీతో పాటు కిడ్నాప్‌కు గురైన ప్రాంతంలో 100 సీసీ కెమెరాలను పరిశీలించారు. శ్వేతను పట్టుకున్నారు. ఆమె కిడ్నాప్ చేసిన పసికందును సేఫ్‌గా స్వాదీనం చేసుకొని తల్లికి అప్పగించారు.
అప్పుడే కళ్లు తెరిచిన పసికందును ఎత్తుకెళ్లి బలివ్వాలని చూసిన శ్వేతను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. అయితే పసికందు ప్రాణాలకు ఎలాంటి ముప్పు తలపెట్టక ముందే కాపాడటం, తల్లిదండ్రుల ఒడికి చేర్చడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news