ఢిల్లీలో పోలీసులు భారీగా లైవ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఔటర్ నార్త్ ఢిల్లీ ప్రాంతం లైవ్ గ్రెనేడ్లను సీజ్ చేశారు పోలీసులు. హోలంబి కాలా ప్రాంతంలోని ఓ పొలంలో వాటిని దాచి ఉంచారు దుండగులు. దీనిపై పోలీసులకు సమాచారం రావడంతో పొలం దగ్గరకు వెళ్లిన పోలీసులు..వాటిని స్వాధీనం చేసుకున్నారు. గ్రెనేడ్లు దాచిన పలువురుని అదుపులోకి తీసుకున్నారు. గ్రెనేడ్‌లను అక్కడ ఎవరు ఉంచారు, వాటిని దాచిపెట్టిన ఉద్దేశ్యం ఏంటి అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి ఉగ్రవాద లేదా గ్యాంగ్‌స్టర్ లింక్‌ను కనుగొనలేదు.
ఢిల్లీ పోలీసులు సుమారు 7 నుండి 8 దేశీయ గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకున్నారు. హోలంబి కలాన్‌లోని మెట్రో విహార్ ప్రాంతంలోని పొలాల్లో దొరికిన లైవ్ గ్రెనేడ్‌లు ఇటీవల తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. అవి లైవ్, కంట్రీ మేడ్ గ్రెనేడ్లను పోలీసులు తెల్చారు. మా బృందాలు హోలంబి కలాన్ ప్రాంతంలో ఏడు-ఎనిమిది దేశీయ గ్రెనేడ్‌లను కనుగొన్నాయి మరియు దీనికి సంబంధించి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి, ”అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు పిటిఐకి నివేదించారు. గ్రెనేడ్‌ల మూలం, ఇతర వివరాల కోసం అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.