Breaking : సీఎస్‌ శాంతి కుమారి కి అదనపు బాధ్యతలు

-

తెలంగాణ చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారికి తెలంగాణ ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా సీఎస్‌ శాంతి కుమారి కి అదనపు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు గవర్నమెంట్‌ సెక్రటరీ వి.శశిధర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్వర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

 

Big Breaking: తెలంగాణ కొత్త సీఎస్‌ గా శాంతి కుమారి - NTV Telugu

ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారని, ఇందులో భాగంగా మహిళా జర్నలిస్టులకు కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. నేటి నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశిబిరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో కూడా మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లోని సమాచార కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని సీఎస్‌ శాంతి కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్‌లో భాగంగా 36 పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉచిత ఆరోగ్యపరీక్షల ఫలితంగా మహిళా జర్నలిస్టులకు ఆర్ధిక భారం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news